Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

2014 లో కాంగ్రెస్, టిడిపి పొత్తు పెట్టుకుంటాయా?


భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ , కాంగ్రెస్ పార్టీతో జతకట్టే పరిస్థితి వస్తుందా? అన్న ప్రశ్న అప్పుడే రాజకీయ వర్గాలలో మొదలైంది. ఈ ప్రశ్నకు అటు కాంగ్రెస్ లోను, ఇటు తెలుగుదేశంలోను కొందరు ఔననే అంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఒకరు దీని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక సంగతి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు , ప్రస్తుతం మంత్రిగా ఒక సీనియర్ నేత గతంలో అంటే రెండువేల ఎనిమిదిలోనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితో ఎన్నికల పొత్తు కుదుర్చుకుందని జోస్యం చెప్పారు. అంటే ఆ పరిణామం కార్యరూపం దాల్చడానికి ఏడాది ముందే ఆయన దానిని పసికట్టారు. ఇప్పుడు కూడా అదే మంత్రి వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టిడిపిలు పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని జోస్యం చెబుతున్నారట. ఒకప్పుడు టిడిపిలో కూడా ప్రముఖ పాత్ర పోషించి, ఆ తర్వాత కాంగ్రెస్ లోను , తెలంగాణ ఉద్యమంలోను ముఖ్య భూమిక పోషిస్తున్న ఆ నేత దీనికి ఒక విశ్లేషణ కూడా ఇస్తున్నారట. 2014 ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకి మెజార్టీ రాదన్నది అందరి గట్టి నమ్మకం. అయితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై ఈ పొత్తులు ఆధారపడి ఉండవచ్చు. అయితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ను కనుక ఎట్టి పరిస్థితులలోను అదికారంలోకి రానివ్వరాదన్న భావన కనుక ఉంటే , అప్పుడు సీట్ల సంఖ్యను బట్టి తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వవచ్చని ఆయన వివరిస్తున్నారట. స్వయంగా తెలుగుదేశం మిత్రులకు కూడా ఈ విషయం ఆయన చెప్పారట.అయితే జగన్ కాంగ్రెస్ అదిష్టానంతో కనుక రాజీకి వస్తే చెప్పలేమని, అలా కాని పక్షంలో ఈ పరిణామం చోటు చేసుకోవచ్చన్నది ఒక అబిప్రాయంగా ఉంది. అదే సమయంలో టిఆర్ఎస్ మాత్రం కేంద్రంలో వచ్చే ప్రభుత్వాన్ని బట్టి మద్దతు నిర్ణయం తీసుకోవచ్చని వీరు ఊహిస్తున్నారు. మొత్తం మీద అప్పుడే కొత్త ఊహలు మొగ్గు తొడుగుతున్నాయన్నమాట. 

No comments:

Post a Comment