Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

వార్తలు రాజకీయ వార్తలు రాజకీయ పుకార్లు సినిమా సినీ వార్తలు సినీ పుకార్లు గ్యాలరీ హీరోలు తారామణులు మూవీ స్టిల్స్ ఈవెంట్స్ మోడల్స్ రివ్యూస్ మూవీ రివ్యూస్ వీడియో సినిమా ట్రైలర్స్ రాజకీయ వీడియోలు క్రీడలు క్రీడలు హొమ్ » రాజకీయ వార్తలు » సీఎం, డిప్యూటీ ఢీ!కిరణ్ స్కీమ్ లన్నీ అట్టర్ ఫ్లాప్ అంటున్న దామోదర


 పెద్దల కుమ్ములాటలు అధికార కాంగ్రెస్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు నాయకుల మధ్య ఆధిపత్య పోరు నానాటికీ ముదురుతోంది. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు ఒకవైపు తీవ్ర రూపు దాలుస్తుండగానే.. మరోవైపు సీఎం-ఆయన డిప్యూటీ దామోదర రాజనర్సింహ మధ్య కూడా విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరూ అంతర్గతంగా పరస్పరం కత్తులు నూరుకుంటున్నారు. సీఎం వ్యవహారం ఏమీ బాగా లేదంటూ దామోదర మండిపడుతుంటే, ఆయన వైఖరే తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ కిరణ్ వర్గం కుతకుతలాడుతోంది. వీరి రగడ మున్ముందు ఏ రూపం తీసుకుంటుందోనన్న ఆందోళన పీసీసీ వర్గాల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది.

డిప్యూటీ సీఎం పదవిని తెరపైకి తెచ్చి, దాన్ని తెలంగాణ నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించగానే, మంత్రి గీతారెడ్డి అభ్యర్థిత్వానికి కిరణే అడ్డుపడి మరీ దామోదరను ప్రతిపాదించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తదనంతర కాలంలో పలు అంశాలపై వారిద్దరి మధ్య పొరపొచ్ఛాలు మొదలైనట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎడం నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో సీఎంపై పలు సందర్భాల్లో రాజనర్సింహ తీవ్రంగానే విరుచుకుపడుతూ వస్తున్నారు. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీలో ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ సమక్షంలోనే సీఎంపై ఆయన నేరుగా దుమ్మెత్తిపోయడం తెలిసిందే.

తాజాగా మంత్రివర్గం నుంచి శంకర్రావు తొలగింపు కూడా డిప్యూటీకి బాగా కలిసొచ్చిందంటున్నారు. ఈ విషయంలో సీఎంపై ఆయన వ్యూహాత్మకంగానే దుమ్మెత్తిపోస్తున్నారని కిరణ్ సన్నిహితులు అనుమానిస్తున్నారు. శంకర్రావు తొలగింపుపై దళిత వర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతుండటంతో, కిరణ్ తీరుపై దామోదర అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సోమవారం సచివాలయంలో కొందరు సన్నిహితులతో మాట్లాడుతూ సీఎం శైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దళితుల పట్ల సీఎం చులకన భావంతో ఉన్నారని, శంకర్రావు తప్పు చేస్తే పిలిచి మాట్లాడి రాజీనామా చేయిస్తే సరిపోయేదని, అలా చేయకుండా నేరుగా బర్త్ఫ్రచేసి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆయన మండిపడినట్టు తెలిసింది.

‘దీన్ని చూస్తు ఎలా ఊరుకోగలం? ఫలితం అనుభవించకతప్పదు. ఎందుకని ఇంతకాలం సహనం వహించాం...? ఇకపై సహించేది లేదు..! మా సంగతేంటో చూపిస్తా..!’ అంటూ సన్నిహితుల వద్ద ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల తీరును తప్పుపట్టారు. ‘‘సీఎం తీరులో మార్పు రావడం లేదు. ఆయన ఇక మారడు. ఆయన చేపట్టిన పథకాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. పారిశ్రామిక సదస్సు కూడా ఫెయిలైంది. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా దళితులను దెబ్బ తీస్తూనే ఉన్నాడు. అధిష్టానానికి ఇవన్నీ తెలుసు. అయినా ఏం చేయాలో అర్థం కాక, తప్పు మీద తప్పులు చేస్తోంది. ఆజాద్ కూడా సీఎంతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నట్లు కన్పిస్తోంది’’ అంటూ దామోదర అనుమానం వ్యక్తం చేశారు.

‘‘సీఎంకు చేతనైతే ఉప ఎన్నికల్లో గెలవమనండి చూద్దాం. అది చేతగాకే, ఏడింట్లోనే ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటుండు. ఇక్కడ మేం కష్టపడుతుంటే ఆయన సెలైంట్‌గా ఉండాలనుకుంటుండు. ఉప ఎన్నికల్లో జగన్ వర్గ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్లీ నవంబర్లోనే కిరణ్‌కు అవిశ్వాస పరీక్ష తప్పదు’’ అని సీఎం తీరును ఎండగడుతూ దామోదర విశ్లేషణలు చేసినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. దళితులు, ఆధ్యాత్మిక చింతన పేరిట రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న విషయాన్ని కొందరు సన్నిహితులు ప్రస్తావిస్తే, ‘‘ఏం నిర్వహించకూడదా? నేను లీడర్ (సీఎం) కావాలనుకుంటున్న. కచ్చితంగా సభలు, సమావేశాలు పెడతా. మా సత్తా ఏందో చూపిస్తా’’ అని కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.

No comments:

Post a Comment