Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అరెస్టే తరువాయి: ముద్దుకృష్ణమ


సునీల్ రెడ్డి అరెస్టు తర్వాత జరిగే అరెస్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ దేనని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ సీన్ క్లైమాక్స్‌కు చేరుకుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు నాయకత్వంతో వైయస్ జగన్ బేరసారాలకు దిగారని, సెటిల్‌మెంట్ కుదిరినట్లు లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తే ఏడేళ్లు ప్రభుత్వం నిద్రపోయిందా అని ఆయన అడిగారు. పేదల భూములను దోచుకున్న పాపం వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి తగులుతుందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మనీ లాండరింగ్‌కు ఎలా పాల్పడిందో తాము శాసనసభలోనే సుదీర్ఘంగా వివరించినట్లు ఆయన తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో అంబేడ్కర్ విగ్రహాల కూల్చివేతపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. విగ్రహాల కూల్చివేత వెనక కాంగ్రెసు పార్టీవారే ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. నల్లగొండ జిల్లా కోదాడలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూల్చినవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన విమర్సించారు.

No comments:

Post a Comment