Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

తెలంగాణ ప్రజలు చిరంజీవిని గాడిదనెక్కిస్తారు : రేవంత్ రెడ్డి


పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు చిరంజీవి గుర్రమెక్కితే.. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు కోసం చిరంజీవి ఉద్యమిస్తే గాడిదనెక్కిస్తారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేత రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంటానని ప్రకటించి ఆ తర్వాత ఫ్లేటు ఫిరాయించిన చిరంజీవి తెలంగాణలో పర్యటించేందుకు ఇక్కడ అడుగుపెడితే తగిన గుణపాఠం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెదేపా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఉదయం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన శిలాఫలకం వద్ద ఆందోళన చేశారు. శిలాఫలకానికి నల్ల గుడ్డ కప్పి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ... పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం చిరంజీవి గుర్రమెక్కితో ప్రాణహిత ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రజలు గాడిదనెక్కిస్తారన్నారు. ఒక రాష్ట్రానికి ఒకే ప్రాజెక్టు అనే మాట అయితే మా తెలంగాణ రాష్ట్రం మాకు ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment