Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

పవన్ నెక్ట్స్ మూవీస్ డిటేల్స్


ప్రస్తుతం గబ్బర్ సింగ్ బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు చిత్రాలకు కమిటయ్యారు. ఆ చిత్రాల్లో మొదటిది పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రెడీ అయ్యేది. ఈ చిత్రం మే నెల నుంచి మొదలవుతుందని పూరీ జగన్నాధ్ స్వయంగా ట్వీట్ చేసారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. దసరాకు ఈ చిత్రం విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఆ చిత్రం తర్వాత రియలెన్స్ వారు నిర్మాత బివివియస్ ఎన్ ప్రసాద్ తో టై అప్ అయ్యి చేస్తున్న చిత్రం చేస్తారు. ఆ చిత్రాన్ని రాజు సుందరం డైరక్ట్ చేస్తారు. కామీడి ఎంటర్టైనర్ గా గమ్మత్తైన కథతో ఆ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.

పవన్,పూరీ కాంబినేషన్ చిత్రం విడుదల అయ్యాకే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభమవుతుంది. పంజా నిర్మించిన సంఘమిత్రా ఆర్క్ బ్యానర్ పై ఆ చిత్రం మొదలవుతుంది. సరదా టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇక గబ్బర్ సింగ్ చిత్రం ఏప్రియల్ 27న విడుదల చేస్తారు. హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రం దబాంగ్ రీమేక్ గా రూపొందుతోంది.

No comments:

Post a Comment