Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

మహేష్ బాబు 'బిజినెస్‌మేన్-2' స్టొరీ గురుంచి


మహేష్,పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం బిజినెస్‌మేన్-2. ఈ చిత్రం స్టోరీ పాయింట్ విదేశాల్లో ఉన్న నల్ల ధనం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్నే మీడియావాళ్లు మహేష్ ముందు ఉంచినప్పుడు ఆయన... జగన్నాథ్ స్క్రిప్ట్‌లో తప్పకుండా ఫైర్ వుంటుంది. అయితే అందులో వున్న కథేంటో నాకు తెలియదు. పూరీ నాకు వినిపించలేదు అన్నారు. అలాగే ఇంత విజయవంతమైన బిజినెస్‌మేన్‌కు సీక్వెల్ చేయాలని చాలా ఉత్సాహంగా వున్నాను. అది షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృత కూడా ఎక్కువైంది. కచ్చితంగా మరో మంచి చిత్రమవుతుంది అని చెప్పారు.

ఇక బిజినెస్‌మేన్‌లో సందేశాలు ఎక్కువ అవ్వలేదంటూ...ఈ చిత్రంలో హీరో నీతులు మాట్లాడలేదు. సందేశాలు వినిపించలేదు. నిజాలు చెప్పాడు..అంతే అన్నారు. ఇక చిత్రంలో చెప్పే సందేశాలను తాను నమ్ముతానని చెప్తూ...నేను ఆ సందేశాలను నమ్మకపోతే నా నుండి మంచి నటన వచ్చేది కాదు అన్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రంలో సరైన విలన్ లేడంటూ...ఈ చిత్రంలో హీరో అతనే, విలనూ అతనే. ఇదొక కొత్త ఫార్మాట్ చిత్రం. హీరో పాత్రను బేస్ చేసుకుని అన్ని రసాలు పండించడం అనేది చాలా అరుదైన స్క్రిప్టుల్లో జరుగుతుంది. అలా వచ్చిందే బిజినెస్‌మేన్ పాత్ర అన్నారు. బిజినెస్‌మేన్ కథ మొదట ఇదొక లవ్ స్టోరీ అనుకున్నాను. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం టిపికల్ స్క్రిప్ట్ అనిపించింది అని చెప్పారు. ప్రస్తుతం మహేష్..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేస్తున్నారు.

No comments:

Post a Comment