Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

దేశ వ్యాప్తంగా 63వ గణతంత్ర దినోత్సవ వేడుకలు!!


దేశ వ్యాప్తంగా 63వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో 25 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ షార్ప్‌షూటర్లు భూతలం నుంచి గగనతలం వరకు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు.

గురువారం ఉదయం 11.15 గంటల నుంచి 12.15 గంటల వరకు ఢిల్లీ గగనతలాన్ని మూసేయనున్నారు. పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే రాజ్‌పథ్, ఎర్రకోట మార్గంలో సీసీటీవీలు అమర్చారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జెండా ఆవిష్కరించే రాజ్‌పథ్ వద్ద బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

రాజ్‌పథ్ చుట్టూ, పరేడ్ జరిగే మార్గంలో భారత వాయుసేన హెలికాప్టర్లు గస్తీ కాయనున్నాయి. మరోవైపు నగరంలోని రద్దీ మార్కెట్లు, మెట్రో రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. గణతంత్ర వేడుకలకు థాయిలాండ్ ప్రధాని ఇంగ్లుక్ షినవత్రా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అలాగే రాష్ట్రంలో గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. పరేడ్ గ్రౌండ్ లోని గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ నాదెండ్ల మనోహర్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డీజీపీ దినేష్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు.

అదేవిధంగా గాంధీ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ నేత చిరంజీవి తదితరులు హాజరయ్యారు. 

No comments:

Post a Comment