తన శరీరాన్ని జీరో సైజుకు తగ్గించుకున్నా అందాలు, వంపు సొంపుల్లో ఎటువంటి తేడా లేకుండా ఆకర్షించే ఆకృతి వెనుక తను పాటించే ఆరోగ్య సూత్రాలే కారణమని చెపుతోంది కరీనాకపూర్.
ప్రతిరోజూ ఆవు నెయ్యిని తెప్పించుకుని తన శరీరం అంతటా మెత్తగా మర్దించి అరగటం తర్వాత స్నానం చేస్తుందట. అదేవిధంగా ఆవు నేతిని భోజనంలో కూడా తీసుకోవడం వల్ల శరీర కాంతి ద్విగుణీకృతమవుతోందని చెపుతోంది.
అంతేకాదు... తను షూటింగ్ నిమిత్తం ఓ పెల్లటూరుకెళితే అక్కడి పల్లెవాసులు గ్లాసులో నిండుగా పాలు తెచ్చి ఇచ్చారట. అప్పటికే ఆకలితో ఉండటంతో గటగటా తాగేసిందట కరీనా. తాగిన తర్వాత అవేం పాలు అని అడిగితే గొఱ్ఱె పాలని చెప్పారట. ముందు కాస్తంత కోపం వచ్చినా... ఆనక ఆ పాలకు సకల రోగాలను నయం చేసే గుణముందని తెలుసుకుని మరుసటి రోజు మరో గ్లాసు గొఱ్ఱె పాలు లాగించేసిందట.
అంతేకాదు గేదె నెయ్యితో తయారైన స్వీట్లు, ఐస్ క్రీములు, పెరుగును మహా ఇష్టంగా లాగించేస్తానని చెపుతోందీ బ్యూటీ. ఇన్ని వెరైటీలను తీసుకోవడం వల్లనే తను ఇంత అందంగా ఉన్నానని బడాయిగా చెపుతోంది.
No comments:
Post a Comment