బాలీవుడ్ తారామణులకోసం టాలీవుడ్, కోలీవుడ్ దర్శకనిర్మాతలు చూస్తుంటే బాలీవుడ్ దర్శకనిర్మాతలు మాత్రం దక్షిణాది హీరోయిన్ల కాల్షీట్లకోసం ఎగబడుతున్నారు. తాజాగా ఈ లిస్టులో తమన్నా కూడా చేరిపోయింది.
ఇటీవల ఆమె నాగచైతన్యతో నటించిన "100 పర్సెంట్ లవ్" సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇపుడు ఇదే కథను హిందీలో శతృఘ్న సిన్హా కుమారునితో తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినట్లు టాలీవుడ్ న్యూస్.
అంతేకాదు.. అజయ్ దేవగన్ సరసన మర్యాద రామన్న అనే చిత్రంలోనూ ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి బాలీవుడ్ నుంచి దిగుమతి అయి టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలను ఓ ఊపు ఊపుతున్న తమన్నా తిరిగి అక్కడికే వెళుతోందన్నమాట.
No comments:
Post a Comment