పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కి విజయవంతమైన హిందీ చిత్రం "బుడ్డా హోగా తేరా బాప్". ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా నటించారు.
అమితాబ్ బాడీ లాంగ్వేజ్‌కు, వయసుకు సరిపడినట్లు స్క్రిప్టును సిద్ధం చేసుకుని బాలీవుడ్ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న పూరీ జగన్నాథ్ ఇపుడు రజినీకాంత్ హీరోగా ఈ చిత్రాన్ని తమళంలో చేయాలనుకుంటున్నట్లు సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.
రజినీకాంత్ ఇటీవల సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా చెన్నైకి తిరిగి వచ్చారు. ఆయన త్వరలో రాణా చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తయ్యాక బుడ్డా చిత్రాన్ని రజినీతో చేయాలని పూరీ అనుకుంటున్నట్లు భోగట్టా. రజినీ ఓకే అంటే ఇక టాలీవుడ్ బుడ్డా తెరకెక్కడమే తరువాయి.
No comments:
Post a Comment