నటీనటులు: అమితాబ్ బచ్చన్, హేమామాలిని, రవీనా టాండన్, సోనూసూద్, సోనాల్ చౌహాన్, ప్రకాష్‌రాజ్, చార్మి, మకరంద్ దేశ్‌పాండే, షావర్ అలీ, సుబ్బరాజు తదితరులు; కెమెరా: అమోల్ రాథోడ్, ఎడిటర్ శేఖర్, సంగీతం: శేఖర్ రాజీవిని, విషాల్‌దడ్లాని, నిర్మాణం: ఎబిసిఎల్ కార్పొరేషన్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.
విడుదల: 1.07.2011 శుక్రవారం
పాయింట్: ముసలివాడైనా సొసైటీని నాశనం చేసే శక్తుల్ని ఎలా నియంత్రించాడు అన్నది.
ఈ చిత్రాన్ని తీయడానికి ముందు దర్శకుడు పూరీ జగన్నాథ్ 'టేకన్' అనే ఆంగ్ల సినిమా చూశాడు. దాంతో రీమేక్ చేయాలన్న ఆలోచనను గురువు అయిన రామ్‌గోపాల్‌వర్మ చెప్పాడు. ఆయన అది వద్దనడంతో అమితాబ్ చెబితే నచ్చే డైలాగ్స్‌ను ఊహించుకుని కథ రాసుకున్నాడు.
'బుల్లెట్ దిగి చావాలి కానీ, బిపీ షుగర్ నా గుండెను ఏమీ చేయలేవనే'. డైలాగ్ ఈ చిత్ర కథకు ప్రేరణగా చెప్పారు. 70 సంవత్సరాలు గల అమితాబ్‌కు కరెక్ట్ టైటిల్ ఇదేనని అనుకుని ఆయనకు చెప్పడం.. ఆయన హ్యాపీగా అంగీకరించడంతో సినిమా తయారైంది. ఇది కేవలం మాస్, అభిమానుల కోసం తీసిన చిత్రం. కథగా చెప్పాలంటే.. ముసలి పోకిరి అని చెప్పవచ్చు. సీరియస్ పాయింట్‌ను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు.
కథ:ముంబైలో రెండుసార్లు బాంబు బ్లాస్ట్‌లు చేసి భయభ్రాంతుల్ని చేస్తున్న కబీర్ (ప్రకాష్‌రాజ్) మరిన్ని పేల్చడానికి రెడీ అవుతాడు. బాంబ్ పెట్టిన వ్యక్తిని ఏవీపీ కరణ్ (సోనూసూద్) అరెస్ట్ చేస్తాడు. తమ రహస్యాలు తెలిసిపోతాయని కరణ్‌ను చంపడానికి కబీర్ ఓ మనిషిని నియమిస్తాడు. కానీ విజ్జూ(బుడ్డా- అమితాబ్) షడెన్‌గా వచ్చి కాపాడతాడు. ఆ తర్వాత పోకిరిలోలాగా విజు గ్యాంగ్‌లో చేరి వారి పనులన్నీ కనిపెడతాడు.
అసలు విజ్జూ పారిస్‌లో ఉంటాడు. తన అవసరం ముంబైలో ఉందని తిరిగి వస్తాడు. విజూ... ఒకప్పుడు ముంబైలో రౌడీ షీటర్. ఇదిలావుంటే చార్మి స్నేహితురాలు సోనాల్‌కు ఏవీసీ కరణ్ లైన్ వేస్తుంటాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారాల్ని విజ్జూ ఒక కొలిక్కితెస్తాడు. ఫైనల్‌గా గ్యాంగ్‌స్టర్‌ను ముంబైలో లేకుండా చేస్తాడు? అసలు ఇవన్నీ ఎందుకు చేశాడు? అన్నది సినిమా.
ఈ కథంతా కేవలం అమితాబ్ గురించే అని చెప్పాలి. ఒన్‌మేన్ ఆర్మీ. బాంబ్‌బ్లాస్ట్‌లు ప్రజలతోపాటు రాజకీయనాయకులు కూడా చనిపోతారు. ఇది సీరియస్.. అక్కడ నుంచి గ్యాంగ్‌ను పట్టుకునే దాకా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా పూరీ ప్రయత్నించాడు. ఇది కత్తిమీద సామే. సీరియస్‌ను కామెడీగా చెప్పడం. కాకపోతే పూరీ తీసిన పలు చిత్రాలన్నీ బుడ్డాలో కన్పిస్తాయి. తెలుగువారికి ఇవన్నీ తెలిసినవి కాబట్టి పెద్దగా కిక్ ఇవ్వకపోవచ్చు. బాలీవుడ్‌కు మాత్రం ఇది కొత్తగా అన్పించవచ్చు.
డెబ్బయి ఏళ్ళ వయస్సులో అమితాబ్ చేసిన డాన్స్, ఫైట్లు, సీరియస్ లుక్‌లు సన్నివేశానికి అతికాయి. అమితాబ్‌కు వాడిని కాస్ట్యూమ్స్ అన్నీ డ్రామాలు ఆడేవారు వేసేవయినా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సరిపోయాయి. అమ్మాయిలతో సరసాలాడడం, బుడ్డా అంటే కోప్పడడం వంటివన్నీ పెద్దలను, పిల్లలను అలరిస్తాయి. ప్రకాష్‌రాజ్, చార్మి, సోనూసూద్ పాత్రలు బాగున్నాయి. సెకండాఫ్‌లో కథను త్వరగా ఎండ్‌చేసి, ముగింపు సరిగ్గా ఇవ్వలేదనిపిస్తుంది. అద్భుతమైన పంచ్ డైలాగ్స్‌తో సినిమా నడుస్తుంది. హేమామాలిని గ్లామర్‌క్వీన్‌గా బాగా కన్పించింది. పొందికగా ఉన్న ఆమె నటన పండింది. రవీనాటాండన్ కాస్త ఓవర్ చేసినట్లుంది. సుబ్బరాజు పోకిరిలో చేసిన పాత్రే అయినా ఇందులో మంచి గుర్తింపు వస్తుంది. చిన్న పాత్రలైనా అందరివీ గుర్తిండేలా దర్శకుడు తీసుకున్న జాగ్రత్త అభినందనీయం.
కెమెరా రాథోడ్ పనితనం అద్భుతం. విశాల్ శేఖర్ సంగీతం అమితాబ్ పాత చిత్రాల్లో ట్యూన్స్‌ను కలగలిపి అందించారు. ఈ చిత్రానికి ప్లస్ అల్లా.. అమితాబ్‌కు చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది. మరోటి పూరీ జగన్నాథ్‌కు మంచి గుర్తింపు రావడం. అమితాబ్ అభిమానులకు కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం టాలీవుడ్‌లో మల్టీప్లెక్స్ అభిమానులకు బాగుంటుంది.
No comments:
Post a Comment