వెంకటేష్ తాజా చిత్రం షాడో లో రిచా గంగోపాధ్యాయను మొదట ఎన్నుకున్నారు. అయితే ఓపినింగ్ రోజున ఊహించని విధంగా సీన్ లోకి తాప్సీ వచ్చి చేరింది. దానికి కారణం గతంలో వెంకటేష్ సరసన ఆమె నాగవల్లి లో చేయటం..ఆ సినిమా ప్లాప్ అవ్వటమే అంటున్నారు. సిని పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ కావటంతో ఆమెను తొలిగించాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అయితే తాప్సీకి ఒక్క హిట్టూ లేదు కదా అనుకున్నా ఆమె వెంకటేష్ తో ప్లాప్ ఇవ్వలేదు కదా అని సర్ది చెప్తున్నారు. అయితే దర్శకుడు,నిర్మాత మాత్రం తమ చిత్రంలో పాత్రకి స్టైలిష్ గా ఉండే నటి కావాలనుకున్నామని తాప్సీ కరెక్టుగా సరిపోతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారని సమాచారం.
ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ కూడా మరో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. కోనవెంకట్,గోపీ మోహన్ కథ అందిస్తున్న ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ తో సాగే యాక్షన్ చిత్రమని చెప్తున్నారు. అలాగే శక్తి వంటి డిజాస్టర్ చిత్రం ఇచ్చిన మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు కావటం కూడా చాలా మందిని ఆశ్చర్యంలో పడేసింది. అయితే అతని సినిమాలు ప్లాప్ అయ్యినా స్టైలిష్ గా తీసిన భిళ్లా చిత్రం అతనికి పేరు తెచ్చిపెట్టిందని,దాన్ని దృష్టిలో పెట్టుకునే వెంకటేష్ ఓకే చేసాడని చెప్పుకుంటున్నారు.

No comments:
Post a Comment