తమిళ నటుడు విక్రమ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'నాన్న'. ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ అందుకుంటోందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా దర్శకనిర్మాతలు, నటీనటులు హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో ప్రేక్షకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ...'మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. గతంలోనూ నేను నటించిన చిత్రాలు ఇక్కడ బాగా ఆడాయి. 'నాన్న' విజయాన్ని నేను ఊహించాను. కాని దర్శకుడు విజరు మాత్రం కొంచెం భయపడ్డాడు. ఇప్పుడు మీ ఆనందాన్ని చూస్తే ఆయనతో బాటు మా యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం' అన్నారు.అనుష్క మాట్లాడుతూ...'నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను. విక్రమ్, సారా చూపిన నటన రియల్లీ సూపర్బ్' అన్నారు. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ మాట్లాడుతూ... 'దర్శకుడు విజరుతో ఇది మూడవ సినిమా' అన్నారు. దర్శకుడు విజరు మాట్లాడుతూ... 'నాన్న'ని ఇంతలా ఆదరిస్తారని కలలో కూడా ఊహించలేదు. మీ ఆదరాభిమానాలను చూస్తుంటే తెలుగులో స్ట్రెయిట్ చిత్రం చేయాలని పిస్తోంది. చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు' అన్నారు.
No comments:
Post a Comment