Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Thursday, January 26, 2012

మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ?తమ్ముడు ఒంటరి వాడయ్యాడా ?


తమ్ముడు ఒంటరి వాడయ్యాడా ? అందరివాడినని చెప్పుకునే అన్నయ్య  తమ్ముడిని పక్కన పెట్టాడా ? మెగా  ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ?   ‘పంజా’ ఆడియోకు అన్నయ్య చిరంజీవి టీం ఎందుకు రాలేదు ? ఫిల్మ్ సర్కిల్ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో టాలీవుడ్ లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిప్రేమతో హీరోగా సెటిలయ్యాడు. ఆ తర్వాత బద్రీ, ఖుషి, తమ్ముడు సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. చిరు వారసత్వంలో టాలీవుడ్ లోకి ఎంటరైన పవన్ కల్యాణ్ కు చిరంజీవి అంటే ప్రాణం. చిరంజీవి 2009లో రాజకీయ ప్రవేశం చేశారు. తిరుపతిలో ప్రజారాజ్యం ఆవిర్భావం జరిగింది. పార్టీలోని యువరాజ్యానికి అధినేత అయ్యిన పవర్ స్టార్ కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకుని  తిట్టిపోశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో పిఆర్పీ ఘోరంగా విఫలమైంది. కేవలం రెండంకెల సీట్లతో సరిపెట్టుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చుంది. అన్నయ్య సీఎం అవుతారని భావించిన పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్నారు.

తరువాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడంతో అన్నయ్యతో తమ్ముడు విభేదించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రజారాజ్యం విలీన కార్యక్రమానికి దూరంగా  ఉన్నాడు. తరువాత చిరు కుటుంబంతోనూ దూరంగానే  ఉన్నాడని సమాచారం. అందుకే ‘పంజా’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్, తన కుమారుడు  మాత్రమే వచ్చారు.  చిరంజీవి ఫ్యామిలీలో ఒక్కరూ కూడా హాజరు కాలేదు. రిలీజ్ సంధర్భంగా పవన్ మాట్లాడుతూ ‘‘తనను ఎవ్వరికీ వారసుడుగా చూడొద్దన్నారు. అంతేకాదు ఒక్క సినిమా హిట్ కాగానే తలకెక్కకూడదన్నారు. పెట్టుబడులు పెట్టేవారు లేకపోవడం వల్లే తన సినిమాలు లేటుగా వస్తున్నాయని’’ అన్నారు. దీనిని బట్టి కొణిదెల ఫ్యామిలీలో మొత్తానికి విభేదాలు మాత్రం వచ్చాయని తేలిపోతుంది.

No comments:

Post a Comment