Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Wednesday, February 1, 2012

ఇలియానా పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా


దిల్ రాజు తెలుగులో డబ్ చేసిన శంకర్ స్నేహితుడు(త్రి ఇడియట్స్ రీమేక్) చిత్రం క్రితం వారం విడుదలైంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పెద్దగా ఊపు లేదు. మార్కెట్ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమా చూసిన వారంతా ఇలియానా చిక్కిపోయి పేషెంట్ లా తయారైందని కామెంట్స్ చేసారు. రివ్యూలలో సైతం ఇదే విషయాన్ని ప్రస్దావించారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఆమెకు ఇ మెయిల్స్ ద్వారా తమ నిరసన వ్యక్తం చేసారు. అయితే ఇందులో ఇందులో ‘‘ఇలియానా... బెల్లియానా’’ పాటకోసం కావాలనే స్లిమ్ అయ్యింది ఇలియానా. పైగా శంకర్ సలహా మీదే ఆమె ఆ పని చేసింది. దాంతో ఇలియానా పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది.

తెలుగులో అస్సలే శక్తి తర్వాత ఆఫర్స్ లేక విలవిల్లాడుతుంటే ఇదో తలనొప్పా అని తలపట్టుకు కూర్చుంది. ఈ సినిమా తెలుగులో డబ్ అవటం వల్లనే కదా అందరికీ విషయం తెలిసిందని వాపోతోందిట. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...‘‘సన్నబడటం ఆరోగ్యపరంగా నాకు మంచిది. కానీ అభిమానులకు మాత్రం అది ఇష్టంలేనట్టుగా ఉంది. జనం మెచ్చింది మనం చేయాలి అన్న సిద్ధాంతానికి కట్టుబడి బరువు పెరగాలనుకుంటున్నాను. ఏది ఏమైనా చాలాకాలం తర్వాత ‘స్నేహితుడు’ రూపంలో నాకు మంచి హిట్ వచ్చింది. ఈ విజయపరంపర ఇలాగే కొనసాగుతుందని నా నమ్మకం’’ అంది. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడిలో నటిస్తోంది. ఈ చిత్రం ఆమెకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందని భావిస్తోంది.

No comments:

Post a Comment