స్కిన్ షో ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తోందని సలోని చెపుతోంది. సలోని చెపుతున్నట్లుగా సినిమాల్లో కన్పించే పాత్రలు నిజజీవితంలో వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాయి. సూర్యకాంతమంటే నిజంగా జీవితంలో ఆమె అలా ఉంటుందేమోనని అప్పట్లో అనుకోవారు. పాత్రలకు వారి జీవితానికి సంబంధమేలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. సినిమా రంగమంటేనే విచిత్ర ప్రపంచం.
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడాలి. ఊరికినే అవకశాలూ పేరూ డబ్బూ రావు. మర్యాదరామన్నతో తెలుగమ్మాయిగా మారిన సలోని.. ఆమధ్య మగధీరలో ఐటంసాంగ్ కూడా చేసింది. ఆమెను పలకరిస్తే... అడుగుపెట్టిన తొలిరోజే స్టార్ అయిపోవాలని ఈ రంగంలోకి రాలేదని నిర్మొహమాటంగా చెప్పింది.
కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు సుఖాలు వస్తాయి. వాటిని ఎదురీది ఈ రంగంలో ఉండాలనుకున్నాను. అన్నిసార్లు మంచి పాత్రలే రావు. కొన్నిసార్లు వేయకూడని పాత్రలు కూడా వేయాల్సివస్తుందని బల్లగుద్ది చెబుతుంది.
No comments:
Post a Comment