Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, May 21, 2011

whats the telugu cinema range in nationwide


* యాక్షన్ లో ఎదురులేదు
* డ్రామాలో తిరుగులేదు
* వసూళ్లలో సాటిరాదు
* మరి అవార్డుల్లో….?
* జాతీయ అవార్డుల్లో మన ప్రాతినిథ్యం ఎంత?
కలెక్షన్ల కింగ్స్…రికార్డుల బ్రేక్స్, గ్రాఫిక్స్ లో అదుర్స్. మరి అవార్డుల్లో ? అదీ జాతీయ అవార్డుల్లో ? వాటి సంగతేంటి ? సినిమా అంటే వినోదాత్మకం.. నవరసాల సమ్మిళితం. మరి అన్నీ సమపాళ్లలో ఉంటే జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నతెలుగు సినిమాకు అవార్డులు ఎందుకు రావడం లేదు. ఎక్కడుంది లోపం. మన దగ్గర అలాంటి నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు లేరా? లేదా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారయ్యిందా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ?
తెలుగు సినిమా పుట్టాక..ఆ ఉత్సవాలు, ఈ ఉత్సవాలంటూ చేసేస్తున్నాం కాని… ఇంతకీ టాలీవుడ్‌కి అంత సినిమా ఉందంటారా. ఎందుకంటే- ఇప్పటివరకూ మనం వేసిన అడుగుల్లో చాలా వరకూ వ్యాపారాత్మకం..వాణిజ్యపరమైనవే. అందుకేనా మనకు అవార్డులు ఎప్పుడూ అందనంత దూరంలో ఉంటాయి. అందని ద్రాక్షలా ఊరిస్తాయి.. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో మన ప్రాతినిథ్యం అంతంతమాత్రమే. ఏంటి దీనికి కారణం. పోనీ మన దగ్గర అంత గొప్పోళ్లు లేరా అంటే.. లేకేం బోలెడంత మంది.
లోకల్ సినిమాను..ఇంటర్నేషనల్ లెవల్లో తీయగల సమర్థులకు కొదవలేదు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ కు కట్టిపడేసే నిపుణులకు సాటిలేదు. మరలాంటప్పుడు ఎక్కడుంది లోపం? ఆరుపాటలు, నాలుగు ఫైట్లు.. ఓ నాలుగు యాక్షన్ సీన్లు.. భారీ ఖర్చుతో క్లైమాక్స్. ఇంతే.. ఇదే మన ఫార్ములా. తరతరాలుగా తెలుగు సినీ రంగం ఫాలో అవుతున్న ఫార్ములా. ఈ మూస పద్దతి దాటి అప్పుడప్పుడు.. అదీ ఏ పున్నానికో, అమావాస్యకో.. ఓ కళాఖండం వస్తుంది.
ఆ తరువాత కథ మళ్లీ మామూలే. ఎందుకిలా జరుగుతోంది?… మన సినిమాల్లో హీరోయిజం కనపడాలి. లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకోరంటారు. యాక్షన్ సీన్లు పండాలి. లేదంటే ఆడియన్స్ గొడవపడతారంటారు. ఇక లవ్ సీన్లలో జీవించడం, కలర్ ఫుల్ సాంగుల్లో స్టెప్పులేయడం, భారీ ఫైట్లలో చితక్కొట్టుడు కొట్టడం మామూలే. ఇలా తీస్తేనే జనం చూస్తారట. లేదంటే చూడరట. అయినా అవార్డుల సినిమాలు తీస్తే… కలెక్షన్ల పరంగా డల్లట. అందుకే వాటి జోలికెళ్లరంట ?
మంచి సినిమా తీస్తే ఎవరైనా చూస్తారు. కాని అది ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి. అప్పుడు సకుటుంబ సమేతంగా ఎందుకు వచ్చి చూడరు. అలా చూడకపోతే…శంకరాభరణం లాంటి సినిమాలు ఎలా ఆడాయి? కలెక్షన్ల వర్షం ఎలా కురిపించాయి.?. చెట్టు ముందా? విత్తు ముందా? అని ప్రశ్నకు సమాధానం ఎలా వస్తుందో.. మారాల్సింది ఆడియన్సా, సినిమావాళ్లా అంటే అలానే ఆన్సర్ వస్తుంది.

No comments:

Post a Comment