Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Wednesday, October 12, 2011

తమిళనాడులో 'దూకుడు' రికార్డు కలెక్షన్స్


తమిళనాడులో 'దూకుడు' చిత్రం మంచి ప్రజాదరణను పొందుతోంది. విడుదలైన మొదటివారంలోనే రూ.51 లక్షల వసూళ్లను సాధించింది. చెన్నైలో ఏ తమిళ చిత్రం కూడా ఈ స్థాయి రికార్డును సాధించలేదు. పేరుపొందిన సత్యం సినిమాహాల్‌లో ఇది ప్రదర్శితమవుతోంది. దసరాకు శ్రీను వైట్ల మరో రెండు ఇతర సినిమాలను కూడా చెన్నైలో విడుదల చేయనున్నారు. ఆంధ్రలో మొదటి వారంలో ఈచిత్రం రూ.50 కోట్లను వసూలు చేసింది. మహేష్ బాబు లేటెస్ట మూవీ దూకుడు తెలుగునాటే కాదు తమిళనాడులోనూ అదే రోజు రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు తమిళనాడులో ఏ హీరోకు లేనంతగా మహేష్ కు ఆదరణ దక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటివరకూ మన వాళ్ళ సినిమాలు పెద్దగా అక్కడ ఆడలేదు.

కానీ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ సాధించటం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది. చెన్నై లో ఇరవై ఒక్క ధియేటర్లలో రిలీజ్ అయిన తమిళేతర సినిమా దూకుడే. కేవలం బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాలు మాత్రమే తమిళనాడులో ఇంతగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఆ తరువాత అంతటి రేంజ్ ను సంపాదించింది కేవలం మహేష్ మాత్రామే. చెన్నై లోని సత్యం సినిమాస్ అనే మల్టీప్లెక్స్ లో అన్ని దియేటర్లు ఈ వారాంతం వరకు హౌస్ పుల్ అయిపోయాయి. చెన్నై తో పాటు తమిళనాడులో మరి కొన్ని నగరాలలో కూడా దూకుడు రిలీజ్ అవుతుంది. వేల్లూర్, కాంచీపురం, తిర్వల్లూర్, తిరిచే, మదురై, తాంబరం, హోసూర్, రామంతపురం, నాగానల్లూర్ వంటి తమిళ సిటీస్ లోష్ విడుదల అవుతున్న తొలి తెలుగు సినిమా దూకుడే. మహేష్ దూకుడు చిత్రం ఇప్పటికే ఎక్కడ విన్నా చాలా పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ రిపోర్టు వినపరడుతోంది. 

ఈ నేపధ్యంలో ఆ చిత్రాన్ని మళకయాళంలో రీమేక్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక తమిళనాడు విషయానికి వస్తే చెన్నయ్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 17 థియేటర్లలో విడుదలైంది ఎన్నడూ లేని విధంగా. అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ నిర్మాతల నుంచి అందిన సమాచారం దూకుడు సినిమా తొలి రోజు దాదాపు రూ. 9 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే రూ. 2 కోట్లు వసూలు చేసిందని డిస్టిబ్యూటరీ వర్గాలు అంటున్నాయి. మరి కొన్ని రోజుల్లో దూకుడు ఇంతకు ముందు వచ్చిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు అభిమానులు. మహేష్ బాబు, సమంత జంటగా నటించిన దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు.

No comments:

Post a Comment