
మహేష్ దూకుడు వరుస సంచలనాలతో దూసుకుపోతుంది. రికార్డ్ కలెక్షన్లతో ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఏ తెలుగు సినిమాకు లేనంత భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుంది. ఈ వసూళ్లతో నిర్మాతలు కూడా హుషారుగామరింతగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ఏ తెలుగుసినిమా సాధించనన్నీ భారీ వసూళ్లు దూకుడుకు వచ్చాయి. దీంతో దూకుడు నిర్మాతలు ఆఫ్రికాలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్రికాలో రిలీజ్ అవుతున్న మొదటి తెలుగుసినిమా, సౌత్ ఇండియన్ సినిమా కూడా ఇదే కానుంది. బోత్సవానా, కెన్యాలోని నైరోబీలో దూకుడు రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దూకుడు టాలీవుడ్ ట్రేడ్ పండితులకు కొత్త పాఠాలు నేర్పుతుంది. మరో రెండు వారాల్లో దూకుడు మగధీర కలెక్షన్ల రికార్డ్ వంద కోట్ల మార్క్ ను దాటే అవకాశాలు ఉన్నాయి.
No comments:
Post a Comment