Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, January 18, 2011

దాసరి పిలిస్తే వెళ్లి చూశా.. ఏమీ అర్థం కాలేదు: రోశయ్య

WD
కోట్లు పెట్టి సినిమాలు తీయడం కష్టమేకానీ, దానికంటే ఆ తర్వాత చేసే ప్రమోషన్‌ కూడా అంతే కష్టం. అందుకే పబ్లిసిటీ లేని చిన్నసినిమాలు ఆదరణకు నోచుకోలేకపోతున్నాయి. హైటెక్‌ యుగంలో విడుదలరోజే నెగెటివ్‌ టాక్‌ వస్తే చాలు ఇక థియేటర్లకు ప్రేక్షకులు రావడం మానేస్తారు. దాంతో ఎలాగో మైకుల ముందు సక్సెస్‌, సూపర్‌హిట్‌, అదుర్స్‌ అంటూ తెగ మాట్లాడేస్తుండాలి. ఇటువంటి కోవలో చాలా చిత్రాలే ఉన్నాయి. 

అగ్రహీరోల చిత్రాలు విడుదలకు ముందు ప్రోగ్రెస్‌ చెప్పడానికి నిరాకరించే నిర్మాత, దర్శకులు చిత్రం విడుదలయ్యాక అటో ఇటో అయితే తప్పనిసరిగా మీడియా ముందుకు వస్తుంటారు. సి. అశ్వనీదత్‌ చిత్రాలు అన్నీ ఇలాగే ఉంటాయి. అలాగే మరికొంతమంది అగ్రనిర్మాతలుకూడా ఈ బాటలోనే పయనిస్తారు.

తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన 'పరమవీరచక్ర' విషయం తీసుకుంటే ఇదే స్పష్టమవుతోంది. విడుదలనాడే హైదరాబాద్‌ క్రాస్‌రోడ్‌లోని శాంతి, సంథ్య ధియేటర్లలో మ్యాట్నీకి కలెక్షన్లు పడిపోయాయి. కొత్త సినిమా అయితే బాల్కనీ టిక్కెట్లు బ్లాక్‌లో కూడా దొరకవు. అటువంటిది బ్లాక్‌ టిక్కెట్లు అసలు రేటుల తీసుకోండని బతిమాలడం మరీ విచిత్రం. ఇందుకుకారణం. ఈనాటి ట్రెండ్‌కు తగినట్లుగా సస్పెన్స్‌, ఉత్సాహం రేకెత్తించేట్లుగా సినిమా లేకపోవడమే. 

బోయపాటి శ్రీను తీసిన 'సింహా'లో డాక్టర్‌ మర్డర్‌ చేయడం వంటి ట్విస్ట్‌లతో యువతనూ ఆకట్టుకున్నాడు. పరమవీచక్రలో దేశద్రోహూలు దేశంలో ఉన్నారని చెప్పి వారిని దేశంకోసం త్యాగం చేసిన వ్యక్తిపై ద్రోహి అని ముద్ర వేస్తే దాన్ని ఎలా సాల్వ్‌ చేశాడనేది కథాంశం. ఇదే కథను ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా పలుమార్పులతో చేస్తే మరింతగా బాగుండేదని ఫిలింనగర్‌ కథనం. కానీ దీనికి దాసరి అంగీకరించరు. దీంతో 'నా సినిమాను 
థియేటర్‌కు వచ్చి చూడడండి' అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
WD
ఎన్నో హిట్‌ చిత్రాలు తీసిన దాసరి నారాయణరావు ఈనాటి ట్రెండ్‌కు తగినట్లు సినిమాలు తీయడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఎం.పి.గా, మంత్రిగా ఉండి ఆ తర్వాత పదవీకాలం పూర్తయ్యాక.. ఏం చేయాలా అని ఆలోచిస్తూ.. తను ఎదిగిన ఫిలిం ఇండ్రస్టీలో మరిన్ని చిత్రాలు తీయాలని సంకల్పించారు.

అలా అనుకుని 'ఫూల్స్‌' సినిమా తీశారు. కానీ అది చతికిల పడింది. చూడ్డానికి థియేటర్‌కు జనాలే రాలేకపోయారు. దాంతో తాను మంచి ప్రయత్నం చేసినా లాభం లేదని తేలిపోయింది. కానీ సాహసంతో మరింతగా రాటుదేలి ఈనాటి దర్శకులకు తీసిపోని విధంగా చిత్రాన్ని తీసి భంగపడ్డారు. అంతా కొత్తవారితో 'యంగ్‌ ఇండియా' తీశారు. కానీ ఆ చిత్రాన్ని కనీసం ఎలా ఉందో చూడ్డానికి థియేటర్‌కే జనాలు రానప్పుడు చేసేదేముంది. 

కనీసం బాగుందో లేదో చూడాలిగా? అని దాసరి ప్రశ్నిస్తున్నారు. నేటి టెక్నాలజీని అన్వయించుకోవడంలో విఫలమయ్యారా? అని అడిగితే.... నేను ఈనాటి దర్శకులకు తీసిపోనివిధంగా టెక్నాలజీని ఉపయోగించాననీ, వారికంటే ముందే ఉన్నానని అంటున్నారు. టెక్నాలజీ అంటే... మేకప్‌ మారుతుందా? రీల్స్‌ మారతాయా? యాక్షన్‌ మారుతుందా? కాస్ట్యూమ్స్‌ మారతాయి. ఫిలిం లెంగ్త్‌ పెరుగుతుందా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏదిఏమైనా తను ఈనాటి ట్రెండ్‌కు తగినట్లు తీయలేకపోతున్నానని మాత్రం అంగీకరించలేకపోతున్నారు.

ఇందుకు ఉదాహరణే తాజాగా ఆయన దర్శకత్వం వహించిన పరమవీరచక్ర. సి.కళ్యాణ్ నిర్మాత. ఈ చిత్రం విడుదలైన మూడో రోజున 30మందిని పిలిపించి చిత్రాన్ని అభినందించే కార్యక్రమానికి నిర్వహించారు. విడుదలరోజే యాభై మంది వివిధ రంగాలకు చెందిన మహిళలకు ప్రదర్శించారు. వారంతా సోమవారం రాత్రి తాజ్‌ డక్కన్‌లో పాల్గొని ప్రసంగించారు. వారంతా పరమవీరచక్ర చిత్రాన్ని చూడలేనివారు దురదృష్టవంతులు. తప్పకుండా ఇటువంటి చిత్రాలు చూసి ప్రోత్సహించాలని బల్లగుద్ది వాదించారు.
WD
క్రికెట్‌ దౌర్భాగ్యంలో ఉన్నాం: బాలకృష్ణ 
బాలయ్య మాత్రం నేటి ట్రెండ్‌కు చురకలు వేశారు. దాసరి 150వ సినిమాలో చేయడం ఆనందంగా ఉంది. నాన్నగారు ఎన్నో ప్రయోగాలు చేశారు. నేను చేస్తున్నాను. సమాజంలో ప్రతిదీ వినోదంగా మారిపోయింది. కార్గిల్‌ యుద్ధంలో మరణిస్తే దాన్ని పట్టించుకోకుండా క్రికెట్‌ గెలిస్తే కేరింతలు కొట్టే దౌర్భాగ్యమైన సమాజంలో మనం ఉన్నాం. దేశాన్ని రక్షించేది సైన్యమే. ఇంటా బయటా మనకు గొడవలే. ప్రతీదీ ఏదైతే అయిందిలే అనుకుంటున్నారు. ఈ చిత్రం ధైర్యం నూరిపోస్తుంది. యువత ఇటువంటి చిత్రాలు చూడాలి. క్రికెట్‌లు ఆడడంకాదు.. అన్నారు.

ఏమీ అర్థంకాలేదు: రోశయ్య 
నేను సినిమాలు చూసేది తక్కువే. దాసరి పిలుపు మేరకు వెళ్ళి చూశాను. మొదటి అర్థభాగం ఏమీ అర్థంకాలేదు. రెండో భాగం చూశాక ఆసక్తికల్గించేలా సినిమా ఉంది. రాజకీయ ప్రభావం త్రివిధ దళాలపై ఎలా ఉందనేది చక్కగా చూపారు. యువత ఇటువంటి చిత్రాలు చూడాలి అన్నారు.

లేడీస్‌ చూడాలి: దాసరి 
మంచి కథాంశం పరమవీరచక్ర. మహిళలు రావాలి. దేశం కోసం త్యాగం చేసిన స్త్రీమూర్తులు ఇందులో ఉన్నారు. గొప్ప సినిమా. ఈ సినిమా ఖచ్చితమైన ప్ర్రజాదరణ పొందుతుంది. అన్నారు.

No comments:

Post a Comment