Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, January 31, 2012

ఇలియానా కు బాగా నచ్చింది..కానీ ప్లాపైంది


నేను నా రాక్షసి' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందులో నా పాత్ర మలచిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. అంత మాత్రాన పాత్రల ఎంపిక నాకు రాదని కాదు కదా. కొన్ని కొన్ని విషయాల్లో మేం ఏమీ చేయలేం'' అని చెప్తోంది ఇలియానా. ఆమె మరోసారి పూరీ జగన్నాధ్ తాజా చిత్రం దేముడు చేసిన మనుష్యులలో నటిస్తోంది. ఆ చిత్రంలో ఆమె రవితేజ సరసన చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.

అలాగే ... ఓ సినిమా ఎందుకు బాగా ఆడింది? ఇంకో సినిమా ఎందుకు నచ్చలేదు? అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు. నా మనసుకి నచ్చినంత మాత్రాన ప్రతీ సినిమా విజయవంతం కావాలనేం లేదు కదా...ఏ పని చేసినా నేను పూర్తిగా అందులో లీనమైపోతాను అంది ఇలియానా. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అల్లుఅర్జున్‌ సరసన జోడీ కట్టింది. 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది. ఆమె శంకర్ దర్శకత్వంలో తమిళంలో నటించిన త్రీ ఇడియట్స్ రీమేక్ తెలుగులో స్నేహుతుడా పేరుతో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

No comments:

Post a Comment