Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, January 31, 2012

ఒక చాన్స్ ..నా సత్తా చూపిస్తా:కాజల్


కథానాయిక కాజల్ అగర్వాల్ కి కామెడీ సినిమాలంటే తెగ ఇష్టమట. అందుకని ఓ పూర్తి నిడివి కామెడీ సినిమాలో నటించాలని వుందని ఈ సుందరాంగి తాజాగా తన కోరిక బయపెట్టింది. చిన్నప్పటి నుంచీ కూడా తనకు కామెడీ సినిమాలన్నా, కామెడీ ప్రోగ్రాములన్నా ఎంతో ఇష్టమని చెబుతోంది. ఏక్షన్ సినిమాలంటే అస్సలు ఇష్టం లేదనీ, టీవీలో అటువంటి సినిమాలొచ్చినా, ప్రోగ్రాంస్ వచ్చినా వెంటనే చానెల్ మార్చేసేదాన్నని చెప్పింది. 

అయితే, సినిమాల్లోకొచ్చాక అంతా ఉల్టా అయిపోయిందనీ, తనకిష్టం లేని ఏక్షన్ సినిమాల్లో నటించాల్సి వస్తోందనీ కాజల్ వాపోతోంది. "ఎవరైనా అవకాశం ఇస్తే ఫుల్ కామెడీ సినిమా చేయాలని వుంది. అలాంటి పాత్ర పోషించే చాన్స్ వస్తే కనుక ఆర్టిస్టుగా నా సత్తా చూపిస్తా. అయితే, కామెడీ చేయడం అంత ఈజీ కాదన్న సంగతి నాకు తెలుసు. అయినా, ఒక్కసారి ఎవరైనా చాన్స్ ఇచ్చి చూడండి" అంటూ రిక్వెస్ట్ చేస్తోంది నేటి బిజీ హీరోయిన్ కాజల్.

No comments:

Post a Comment