Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Wednesday, October 12, 2011

మహేష్ ని పర్సనల్ గా కలిసిన ఇలియానా



మహేష్ తో ఇలియానా చేసిన పోకిరి చిత్రం ఏ రేంజి విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇలియానా,పూరీ కాంబినేషన్ లో నేనూ ..నా రాక్షసి చిత్రం వచ్చింది కానీ మహేష్ తో చిత్రం రాలేదు. అయితే మరో సినిమా మహేష్ తో చేయాలని ఇలియానాకు ఆశ పుట్టినట్లుంది. ఆమె రీసెంట్ గా ది బిజెనెస్ మ్యాన్ షూటింగ్ కి హాజరైంది. అక్కడ మహేష్ తో స్పెషల్ లంచ్ తీసుకుంది. దూకుడు సక్సెస్ కు మహేష్ కు కంగ్రాట్స్ చెప్పింది. ఓ ఐదు నిముషాలు వచ్చి వెళ్లిపోదామనుకున్న ఆమె ఆ పూటంతా అక్కడే గడిపిందిట.మరో ప్రక్క పూరీ జగన్నాధ్ తో కబుర్లు చెపుతూ షూటింగ్ చూస్తూ మెచ్చుకుంటూ గడిపేసిందని చెప్తున్నారు. తెలుగులో శక్తి చిత్రం తర్వాత ఇలియానా మీద అనధికారికంగా బ్యాన్ కొనసాగుతున్న పరిస్దితి ఉంది. ఆమె చేతిలో తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో ఎలాగైనా మహేష్ ప్రక్కన సినిమా ఛాన్స్ సాధించాలని ఇలా రౌండ్స్ వేస్తోందని చెప్తున్నారు

No comments:

Post a Comment