బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ అస్వస్థతకు గురై ముంబై నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమచారం. ఆమెకు మానసిక ఒత్తిడితో పాటు బిపి పెరగటంతో నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చేర్చినట్లు ఆస్రత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె తల్లిదండ్రులు కూడా ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలిసింది. ఇతర కుటుంబీకులు కూడా సాయంగా అక్కడే ఉన్నట్లు తెలిసింది. ఆమెకు ఎర్రరక్తకణాలు కౌంట్ తక్కువైనట్లు తెలిసింది. అంతేగాక రక్తస్రావం అయినపుడు అవసరమయ్యే ప్లాస్మాపదార్ధం హీమోగ్లోబిన్ కూడా తక్కువైనట్లు తెలిసింది. తింటే లావు అయిపోతామేమో అని అధికంగా డైటింగ్ చేసిన డైటింగ్ ఈ ప్రమాదం తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. ఇక షూటింగ్ షెడ్యూల్స్ చాలా ఒత్తిళ్లతో కూడుకుని ఉండటం, మానసిక ఒత్తిడి పెరగటం, బిపి పెరగటం జరుగిందని చెప్తున్నారు.ఇక విద్యాబాలన్ తాజాగా సిల్క్‌స్మిత జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరకెక్కుతున్న 'డర్టీ పిక్చర్' లో నటిస్తోంది.
No comments:
Post a Comment