Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, June 14, 2011

ఆ మిల్కీ బేబీలకోసం ఎగబడుతున్న కోలీవుడ్


కోలీవుడ్ సినీదర్శక నిర్మాతలు ముగ్గురంటే ముగ్గురు మిల్కీ బేబీల పేర్లు చెపితే, తమకు డేట్లిస్తారా...? అని చటుక్కున అడుగుతున్నారట. ఆ "తెల్లపిల్లల" కాల్షీట్లకోసం క్యూ కడుతున్నారట. ఇంతకీ ఆ ముగ్గురూ ఎవరనుకుంటున్నారా...? ఇంకెవరో కాదు.. తమన్నా.. తాప్సీ.. హన్సిక.

ఇప్పుడు కోలీవుడ్‌లో వీళ్ల ముగ్గురి హవా నడుస్తోంది. ఇందుకు బలమైన కారణం ఉందంటున్నారు కోలీవుడ్ సినీజనం. అదేమంటే... తమ చిత్రాల్లో ఉత్తరాది హీరోయిన్లు నటిస్తే చాలు.. అది హిట్టేనన్న విశ్వాసం బలంగా నాటుకుపోయిందట. అందువల్లనే వీరికోసం సదరు దర్శకనిర్మాతలు ఎదురు చూపులు చూస్తున్నారు. 

తమన్నా విషయాన్నే తీసుకుంటే "కల్లూరి" అనే తమిళచిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగిడిన ఈ మిల్కీబేబీ ఆ తర్వాత "ఆనందతాండవం", "కండేన్ కాదలై", "పయ్యా", "సిరుత్తై" చిత్రాలతో టోటల్‌గా తమిళనటిగా విజృంభించింది. సూర్య సోదరుడు కార్తితో వేడివేడి దృశ్యాల్లో నటించిన ఈ భామ చిత్రమంటే కోలీవుడ్ కుర్రకారు చూసేందుకు ఎగబడతారు. 

ఇక ఇటీవల రజినీ అల్లుడు ధనుష్ సరసన నటించిన "ఝుమ్మంది నాదం" హీరోయిన్ తాప్సీకి కూడా ఇక్కడ బాగా గిరాకీ పెరిగిందట. "ఆడుగళం" చిత్రంతో తమిళ ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ ఇప్పుడు "వందాన్ వెండ్రాన్" చిత్రంలో నటిస్తోంది. ఇంకా ఓ అరడజనుకు పైగా చిత్రాల్లో నటించనున్నట్లు సమాచారం. 

"దేశముదురు" హన్సికను చూస్తే తమిళ కుర్రకారు తెగ చొంగ కార్చుకుంటున్నారట. అందుక్కారణం ఆమె నటించిన "ఎంగేయుం కాదల్" "మాప్పిళ్లై" చిత్రాలేనంటున్నారు. ఈ చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టడంతో అమ్మడి కాల్షీట్లకోసం కోలీవుడ్ దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారట. పైగా హన్సికకు కుర్రకారు ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో ఈమెకు అవకాశాలిచ్చేందుకు ముందుకొస్తున్నారట.

No comments:

Post a Comment