2007 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ అందాలబొమ్మ ఐశ్వర్యారాయ్‌ను అమితాబ్ సుపుత్రుడు అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఐశ్వర్య గర్భం దాల్చిందంటూ వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ మీడియా పుకార్లేనని తేలింది.
ఈ నేపథ్యంలో తాజాగా అమితాబ్.. స్వయంగా ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇదే విషయంపై ఐశ్వర్య ప్రచార సహాయకురాలు అర్చనా సదానంద్ మాత్రం మాట్లాడుతూ.. ఐష్ మామాగారే స్వయంగా వెల్లడించారు. ఇక నేను చెప్పేది ఏముంది అని సమాధానం ఇచ్చారు. కాగా, ఐశ్వర్య ప్రస్తుతం మధుర్ భండార్కర్ రూపొందిస్తున్న 'హీరోయిన్' సినిమా షూటింగ్‌లో నిమగ్నమై వుంది.
No comments:
Post a Comment