ఆయన సరసన ఛాన్స్ వస్తే.. తమ మధ్య ఎత్తు సమస్య ఉన్నది కనుక ఆయనతో నటించే అవకాశం లేదని చెప్పేసింది. అంటే.. వెంకీని తీసి పారేసిందా...? అనే కోణంలో నిన్నటి నుంచి నెట్ లోకం ఒకటే గోల చేసి పారేసింది. దీంతో తెల్లారేసరికి నిత్యామీనన్ తన వ్యాఖ్యపై వివరణ ఇచ్చుకుంది.
తను ఎత్తు తక్కువ కనుక వెంకటేష్ ప్రక్కన సరిపోనని చెప్పాను తప్పించి ఆయనతో నటించనని చెప్పలేదని అంది. ఆయన హ్యాండ్‌సమ్ హీరో అని పొగడ్తలతో ముంచెత్తింది. అయినా వెంకీ పిలిచి ఛాన్స్ ఇస్తే కాదని ఎవరంటారు చెప్పండీ అని ఎదురు ప్రశ్నలు వేస్తోంది. మొత్తానికి ఇండస్ట్రీ పోకడల్ని బాగానే అర్థం చేసుకుంది నిత్య.
No comments:
Post a Comment