Pages

Monday, July 25, 2011

మిల్కీ బేబీ తమన్నాకు బాలీవుడ్ పిలుపు


చాలామంది హీరోయిన్ల మాదిరిగానే తమన్నా కూడా ఉత్తరాది నుంచి దిగుమతి అయిన ముద్దుగుమ్మే. అయితే ఈ మిల్కీ బ్యూటీకి తొలి విజయం టాలీవుడ్ అందించినప్పటికీ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్లిచ్చింది కోలీవుడ్. కానీ వీటన్నిటికంటే ముందు ఓ హిందీ చిత్రంలో నటించింది. అయితే అది బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో చేసేది లేక ఇటువైపు వచ్చేసింది. 

ఇపుడు దక్షిణాది తారలైన అసిన్ వంటివారు బాలీవుడ్‌లో రాణిస్తుండటంతో తిరిగి వారిని బీట్ చేయాలని తమన్నా అనుకుంటున్నట్లు టాలీవుడ్ ఫిలిం జనం చెపుతున్నారు. 

ఆమె అనుకున్నట్లుగానే అజయ్ దేవగణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న చిత్రాన్ని హిందీలో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో సలోని పాత్రలో తమన్నాను నటింపజేయాలని అజయ్ దర్శకునికి చెప్పినట్లు భోగట్టా. మొత్తానికి తమన్నా అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందన్నమాట.

No comments:

Post a Comment