Pages

Friday, June 3, 2011

ఆ విషయంలో కాజల్‌కు చాలా థ్యాంక్స్‌: సమంత


File
FILE
"తోటి నటులతో స్నేహపూర్వకంగా మెలగాలి. నా వరకూ నేను అలాగే ఉంటాను. నేను చేసిన రెండో సినిమాలోనే బృందావనంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ విషయంలో కాజల్‌కు థ్యాంక్స్ చెప్పాలి" అని సమంత చెపుతోంది. 

కాజల్ అంతగా ఏం చెప్పిందేంటి..? అని ప్రశ్నిస్తే... "ఏదైనా సరే.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మంచి, చెడు విషయాలు చాలా జాగ్రత్తగా చెప్పింది" అంటూ కాజల్‌ను మెచ్చుకుంది. 

ఇంకా తనే మళ్లీ మాట్లాడుతూ... "ఈ రోజుల్లో చాలామంది ఇగోలకు పోతున్నారు. కాజల్‌ అలాక్కాదు. సినిమా రంగంలోనే పోటీ ఉంటుంది. కానీ అది ఆరోగ్యకరంగా ఉంది" అని చెప్పింది సమంత.

No comments:

Post a Comment