Pages

Friday, June 3, 2011

70 ఏళ్లొచ్చిన మగాళ్లను కుర్రాళ్లగానే చూపిస్తారు: మీనా


"సహజంగా పెళ్ళయిన హీరోయిన్లకు పిల్లలు పుడితే వారిని తల్లి, అక్క, వదిన పాత్రలకే పరిమితం చేస్తారు దర్శకనిర్మాతలు. అదే హీరో అయితే 60 ఏళ్లు పైబడినా కుర్రహీరోయిన్‌తో తైతక్కలాడిస్తారు. ఇదీ లోకం తీరు" అంటోంది వెంగమాంబ హీరోయిన్ మీనా. 

ఇటీవలే ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. కుటుంబ జీవితాన్ని గడుపుతోంది. అయితే తెలుగులో ప్రముఖ హీరో తల్లిగా నటించమని ఆమెకు ఆహ్వానం అందింది. లేదంటే అత్తగానైనా చేయమని అడిగారు.

ఆ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తోసిపుచ్చింది. ప్రస్తుతం తనకు కుటుంబంతోనే టైమ్‌ సరిపోతుందని చెప్పింది. అత్తగా కనిపించడానికి ఇష్టం లేక ఇలా వంక చెప్పిందని అంటున్నారు సినీజనం.

No comments:

Post a Comment