Pages

Friday, September 16, 2011

శరీర అందాలను చూపించే ప్రసక్తే లేదు: మీరా నందన్


తనకు వచ్చే గ్లామర్ ఓరియంటెడ్ పాత్రల కోసం తన శరీర అందాలను చూపించే ప్రసక్తే లేదని "జైబోలో తెలంగాణ" హీరోయిన్ మీరా నందన్ చెపుతోంది. దీనివల్ల తనకు అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదని, అలాగే ఇండస్ట్రీలో చెడు పేరు వచ్చినా ఫర్వాలేదని కుండబద్ధలు కొట్టినట్టు చెపుతోంది. 

మల్లు కుట్టిగా పేరొందిన మీరా నందన్‌ 'జై బోలో తెలంగాణ' చిత్రంతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రంలో ఆమెకు పూర్తి పాత్రను దర్శకుడు ఎన్.శంకర్ ఇచ్చారు. అయినప్పటికీ.. ఆమె బిజీ హీరోయిన్‌గా మారలేక పోయింది. 

ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది హీరోగా నటించే "వస్తాద్" చిత్రంలో మీరా నందన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. 

ఆది హీరోగా గతంలో వచ్చిన "మృగం", "వైశాలి" వంటి రీమేక్ చిత్రాలు మంచి సక్సెస్‌నే సాధించాయి. తాజాగా రానున్న "వస్తాద్" చిత్రంపై మంచి ఆశలనే పెట్టుకుని ఉన్నారు. అయితే, ఈ చిత్రంలో మీరాకు మంచి గ్లామర్ పాత్రను ఇచ్చినప్పటికీ ఆమె మాత్రం తన శరీర అందాలను కెమెరా ముందు ఆరబోసేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం.

No comments:

Post a Comment