Pages

Friday, September 16, 2011

వేషం కావాలంటే.. పడక సీనుకు ఒప్పుకోవాల్సిందేనట!!


ఓ తమిళ నిర్మాత నుంచి భోజ్‌పురి హీరోయిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. భోజ్‌పురిలో ఐటమ్‌ గర్ల్‌గా గుర్తింపు పొందిన నిషా నందన్... తన కెరీర్‌‌ను బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆమె.. తమిళ చిత్ర పరిశ్రమకు చిందిన రామ్‌నాథ్ అనే నిర్మాతను సంప్రదించింది. 

'సైతాన్' అనే హిందీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసిన ఈ నిషా.. ఆ తర్వాత ముంబైలో జరిగిన ఒక పార్టీకి హాజరు కాగా, సదరు నిర్మాత అక్కడ పరిచయమయ్యాడట. తాను రజనీకాంత్, రమ్యకృష్ణ, ప్రియమణి తదితరులతో తమిళంలో ఓ చిత్రం చేస్తున్నట్టు పరిచయం చేసుకున్న ఆ నిర్మాత.. నిషాకు కూడా మంచి ఆఫర్ ఇస్తానని ఆశ పెట్టాడట. ఇది నిజమేనని నమ్మిన నిషా.. ఆయనతో మరింత చనువుగా మాట్లాడటం మొదలెట్టింది. 

రెండుమూడు రోజులు గడిచిన తర్వాత నిర్మాత నిషా నందన్‌కు ఫోన్ చేసి లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడట. తాను తీసే చిత్రంలో హీరోయిన్ వేషం కావాలంటే తనతో రాత్రిపూట పక్కలో గడపాలని కోరాడట. దానికి అంగీకరించని ఆ భామ.. ఆ తర్వాత సదరు నిర్మాత గురించి వాకబు చేయగా అసలు విషయం బయటపడింది. 

తనకు పరిచయమైన వ్యక్తికి సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం పరిచయం లేదని తేలిందని చెప్పారు. దీంతో తాను షాక్ అయ్యానని నిషా వాపోతోంది. అంతేగాక తాను ఛోటా రాజన్ గ్రూప్‌కు చెందిన వాడినని బెదిరించాడని అదే పదే పదే గుర్తుకు వస్తోందని అంటుంది. 

ఇక ఈ పరిశ్రమలో ఇలాంటివి కామన్ అని కొందరు అంటున్నా తాను జీర్ణించుకోలేక పోతున్నానని చెపుతోంది. దీనిపై ముంబై పోలీసులకు ఆ భామ ఫిర్యాదు చేసి, ఈ విషయాన్ని బయటపెట్టినట్టు చెప్పుకొచ్చింది.

No comments:

Post a Comment