Pages

Tuesday, July 19, 2011

ఆగస్టులో ముగ్గురు

సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డి.రామానాయుడు నిర్మిస్తున్న 'ముగ్గురు' షూటింగ్‌ పూర్తి చేసుకుంది. వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో నవదీప్‌, రాహుల్‌, అవసరాల శ్రీనివాస్‌ హీరోలుగా నటిస్తున్నారు. డి.రామానాయుడు మాట్లాడుతూ...'మలేషియా, కారంచేడు, వైజాగ్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన షెడ్యూల్స్‌తో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ప్యాచ్‌వర్క్‌, ఎడిటింగ్‌ జరుగుతోంది. చెప్పినదానికంటే అద్భుతంగా డైరెక్టర్‌ వి.ఎన్‌.ఆదిత్య తెరకెక్కించారు. నవదీప్‌, రాహుల్‌, శ్రీనివాస్‌ వారి క్యారెక్టర్స్‌లో ఎంతో ఇన్‌వాల్వ్‌ అయి చేశారు. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. 'ముగ్గురు' మా బ్యానర్‌లో మరో మంచి హిట్‌ చిత్రంగా నిలుస్తుందని నా నమ్మకం. కోటి సారథ్యంలో రూపొందిన ఆడియో చాలా పెద్ద హిట్‌ అవుతుంది. జూలై నెలాఖరులో ఆడియోను విడుదల చేసి, ఆగస్ట్‌ రెండో వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. 

No comments:

Post a Comment