Pages

Tuesday, July 19, 2011

'దడ' ఆగస్టు 12న విడుదల

నాగచైతన్య తాజా చిత్రం 'దడ' ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై అజరు భూయాన్‌ దర్శకత్వంలో శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ...'నాగచైతన్య, కాజల్‌ జంటగా రూపొందుతున్న 'దడ' చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. సినిమా చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. కంప్లీట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. నాగచైతన్య పెర్‌ఫార్మెన్స్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. దేవిశ్రీప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ డెఫినెట్‌గా పెద్ద హిట్‌ అవుతుంది. ఈనెల 24న ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరపనున్నాం' అన్నారు.
నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అజరు భూయాన్‌

No comments:

Post a Comment