Pages

Monday, July 25, 2011

గ్లామర్ ఇమేజ్ రాలేదని ఫీలవుతున్న ప్రియమణి!


ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్‌లోనూ అందాలను ఆరబోసినప్పటికీ గ్లామర్ ఇమేజ్ రావడం లేదని ఉత్తమనటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రియమణి తెగ ఫీలైపోతోంది. ఫిలింఫేర్ అవార్డ్స్‌తో ఎన్నో పురస్కారాలు అందుకుని, పరుత్తివీరన్‌తో నటిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ గ్లామర్ ఇమేజ్‌ రావడంలేదని బాధపడుతుంది.

'ద్రోణ'లాంటి సినిమాలో మాగ్జిమమ్ ఎక్స్‌పోజ్ చేసినా, రాజ్ సినిమాలో అందాలను ఆరబోసినా ఫలితం లేదంటోంది ప్రియమణి. అనుష్క, ఇలియానా, తమన్నాల్లా గ్లామర్ హీరోయిన్‌గా సౌత్ ఇండస్ట్రీని ఏలాలనుకుంటున్న ప్రియమణికి అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయట. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తున్న ప్రియమణికి ఈ మధ్య ఆఫర్లు తక్కువగా వస్తున్నాయట. మరి లేటెస్ట్‌గా చేస్తున్న "క్షేత్రం" సినిమా ఏ మేరకు ఫలితమిస్తుందో వేచి చూడాల్సిందే..!

No comments:

Post a Comment