Pages

Friday, July 1, 2011

వర్మ నిర్మాతగా మెగాస్టార్ 151వ చిత్రం "దొర... ది లార్డ్"??



మెగాస్టార్ చిరంజీవి ముఖానికి మళ్లీ రంగేసుకోనున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కోర్కె, కోట్లాది మంది అభిమానుల ఆకాంక్ష మేరకు మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తాజాగా ప్రకటించారు. 

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఈ 150వ చిత్రం రూపొందనుంది. ఇందులో బిగ్ బి కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర కథను పూరీ జగన్నాథ్ కథ రాసి స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. 

అయితే, 151వ చిత్రాన్ని మాత్రం రామ్ గోపాల్ వర్మ నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి "దొర... ది లార్డ్" అనే పేరును పెడతానని చెప్పారు. ఈ పేరుతో కథను సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, చిరంజీవి నటించే 150వ చిత్రం మగధీర రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment