Pages

Wednesday, June 15, 2011

పనీపాట లేనివాళ్లు మాట్లాడితే స్పందించాలా...?: రాంచరణ్



ఇటీవల రామ్‌చరణ్‌ వివాదాల్లో ఇరుక్కున్నాడు. హీరోయిన్లు అవార్డు ఫంక్షన్లుకు రావడంలేదని దాసరి కామెంట్‌ చేస్తే... రాంచరణ్ మాత్రం తాను ఎక్కడికి వెళ్ళినా హీరోయిన్లు వస్తున్నారని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఆ తర్వాత దాసరి శిష్యుడు నట్టికుమార్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి.. ఏకంగా రామ్‌చరణ్‌ తెలీసీ తెలియకుండా మాట్లాడాడనీ, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడ్డాడు. 

రామ్‌చరణ్‌ నటిస్తున్న 'రచ్చ'చిత్రం షూటింగ్‌ కార్యక్రమం జరిగింది. అప్పుడు నట్టికుమార్‌ విషయం లేవనెత్తారు. దాంతో... రామ్‌చరణ్‌ ఘాటుగా స్పందించారు. ఎవరో పనీపాటా లేని వాళ్ళు పబ్లిసిటీకోసం వచ్చి రెచ్చిపోతే వారికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని కొట్టిపారేశారు. 

దీంతో నెక్ట్స్ ఎటాక్ కోసం నట్టికుమార్‌ దాసరి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లు ఫిలింనగర్ చెప్పుకుంటోంది. సమయం వచ్చినప్పుడు బయటపడదాం, ప్రస్తుతానికి నైలెంట్‌గా ఉండమని దాసరి చెప్పినట్లు భోగట్టా.

No comments:

Post a Comment