Pages

Friday, June 17, 2011

కలైంజర్... ఒడంబు నల్లా పాత్తుకోంగో..: రజినీ పలకరింపు


డీఎంకే పార్టీని ఓడించి తమిళనాడును జయలలిత రక్షించారని నిన్నగాక మొన్న వ్యాఖ్యానించిన సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆ పిమ్మట మాజీముఖ్యమంత్రి కరుణానిధికి ఫోన్ చేసి మాట్లాడారు. 

తను జయలలితను పొగుడుతూ చేసిన ఒకే ఒక్క వాక్యాన్ని మీడియా మెగాస్కోపులో చూపించేసరికి రజినీ ఎందుకైనా మంచిదని పెద్దాయనకు స్వయంగా తనే ఫోన్ చేసి క్షేమ సమచారాలు వాకబు చేశారట. 

ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలవడం, మాజీకేంద్రమంత్రి ఎ.రాజా, కుమార్తె కనిమొళి జైలుపాలవడం వంటివాటిని ప్రస్తావించకుండా కేవలం కరుణ ఆరోగ్యం గురించే పదేపదే అడిగారట. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న మీకు ఇటువంటి ఓటములు పెద్ద విషయమేమీ కాదని ధైర్య వచనాలు వల్లించారట. 

మొత్తానికి రజినీలో రాటుదేలిన రాజకీయనాయకుడి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే రాజకీయాల్లోకి రమ్మంటే మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేస్తుంటారు. ఒకవేళ వస్తే పొలిట్రిక్స్ దెబ్బకు చిత్తైపోతామనే భయమేమో..?!!

No comments:

Post a Comment