Pages

Friday, June 17, 2011

నాకంటే నా చెల్లి చాలా తెలివైంది: కాజల్‌ అగర్వాల్


"నేను అమాయకురాలిని. కానీ నాకంటే మా చెల్లెలు నిషా అగర్వాల్‌ చాలా తెలివైంద"ని కాజల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. తన నటన గురించిగానీ, సినిమా రికమండేషన్‌ల గురించి కానీ అడగదని కితాబిస్తోంది. 

తనకంటే అది యాక్టింగ్‌లో మంచి దిట్టని పొగుడుతోంది. ప్రతి సినిమాలోనూ తన టాలెంట్‌ నిరూపించడానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటుందని ప్రకటిస్తోంది. అలా అని పిచ్చిపిచ్చి అవకాశాలు చేయననీ చెబుతోంది. 

తామిద్దరం కలిస్తే ఇంట్లో భోజన టైంలో కలుస్తామనీ, అప్పుడు తను చెప్పాలనుకుంటే సినిమా కబుర్లు చెబుతుందనీ, లేదంటే మామూలు విషయాలు మాత్రమే తమ మధ్య సాగుతాయని చెప్పింది. ఇంతకీ తన సిస్టర్ సంగతులు ఇంతగా ఎందుకు చెపుతున్నట్లు.. టాలీవుడ్ దర్శకనిర్మాతలకు తెలియాలనా..?!!

No comments:

Post a Comment