Pages

Monday, June 27, 2011

సత్యసాయిగా నాగార్జున "100%" సూటవుతాడట


ఆధ్యాత్మిక చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే కోడి రామకృష్ణ పుట్టపర్తి సత్యసాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సత్యసాయి పాత్రకు ఎవర్ని తీసుకోవాలన్నదానిపై ఆయన లోతుగా పరిశీలన చేస్తున్నారు. 

ఇదిలావుంటే ఈ పాత్రలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున అయితే 100% సూట్ అవుతారని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. గ్రీకువీరుడుగా పేరు తెచ్చుకున్న నాగార్జున అన్నమయ్య చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించారు. ఇపుడు సత్యసాయి పాత్రలోనూ అంతకు మించిన నటనను కనబర్చగలరని చెపుతున్నారు. 

ఇంకా సత్యసాయి పాత్రకు ప్రకాష్‌రాజ్, విక్రమ్ లాంటి హీరోలు కూడా పోటీపడుతున్నట్లు సమాచారం. మరి కోడి రామకృష్ణ ఏ హీరోను "సత్యసాయి బాబా"ను చేస్తారో చూడాలి.

No comments:

Post a Comment