Pages

Saturday, January 28, 2012

పవన్ కళ్యాణ్ తో కాజల్ రొమాన్స్!?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొంద బోతున్న విషయం తెలిసిందే. మే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి గబ్బర్ సింగ్ చిత్రంతోనే కాజల్ పవన్ కళ్యాణ్ సరసన నటించాల్సి ఉంది. అయితే అప్పుడు డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. పూరి పుణ్యమా అని మహేష్ బాబుతో కలిసి నటించాలనే తన కోరిక నెరవేచ్చుకున్న కాజల్...తాజాగా పూరి మూలంగానే పవన్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేసింది.

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది. అనంతరం మే నెల నంచి పవన్-పూరి సినిమా సెట్స్ పైకి రానుంది.

No comments:

Post a Comment