Pages

Friday, January 27, 2012

రజనీ కూతురునీ అవమానించిన శృతి హాసన్!


ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు అవమానం జరిగిందా? అంటే అవును అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ అవమానాకి కారణం ఎవరో కాదు...రజనీ సహచర నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. అయితే శృతి నేరుగా ఆ పని చేయక పోయినా, రజని కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ తో ప్రవర్తించిన తీరే అందుకు కారణం.

వివరాల్లోకి వెళితే....రజనీ కూతురు ఐశ్వర్య దర్శకురాలిగా నిలదొక్కుకోవడానికి ప్రపయత్నిస్తోన్న సంగతి తెలిసిదే. ఐశ్వర్య తీయబోయే సినిమాలో ఆమె భర్త ధనుష్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ధనుష్ సరసన శృతి అయితే బాగుంటుందని భావించిన ఐశ్వర్య ఈ మేరకు తన సినిమాలో హీరోయిన్ గా నటించాలని ఆమెను కోరింది.

అయితే...కనీసం ట్రై చేస్తాను అని కూడా చెప్పకుండా, తాను చాలీ బిజీ, డేట్లు ఇవ్వడం కుదరదు అంటూ తెగేసి చెప్పిందట శృతి. శృతి అలా మాట్లాడటంతో ఐశ్వర్య అవమాన భారంతో వెనుదిరిగినట్లు సమాచారం. ప్రస్తుతం శృతి తమిళంలో ఓ సినిమాతో పాటు, తెలుగులో గబ్బర్ సింగ్, ఓమై ఫ్రెండ్ సినిమాలతో బిజిగా ఉంది.

No comments:

Post a Comment