Pages

Friday, January 27, 2012

నాగార్జున కోరికను నయనతార క్యాష్ ..!?


నాగార్జున కోరికను నయనతార క్యాష్ చేసుకోవాలని చూస్తోందంటూ ఫిల్మ్ నగర్లో గాసిప్ప్ వినిపిస్తున్నాయి. శ్రీరామ రాజ్యం సినిమా తర్వాత నయనతార నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నయనతారను ఎలాగైనా తన సినిమాలో బుక్ చేసుకోవాలనుకున్న నాగార్జున ఈ మేరకు దర్శక, నిర్మాతలతో సంప్రదింపుల వ్యవహారం నడిపించి సక్సెస్ అయ్యారు. ఎట్టకేలకు నయనతార నాగార్జునతో నటించేందుకు ఒప్పుకున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాలో నటిచేందుకు నయనతార రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. నాగార్జున తననే హీరోయిన్‌‍గా నటింప చేయాలని బలంగా నిర్ణయించుకోవడంతో...ఈ విషయం పసిగట్టిన నయనతార రేటు విషక్ష్ంలో ఏమాత్రం కిందకు దిగడం లేదని, నిర్మాతలు రూ. కోటి నుంచి కోటిన్నర మధ్యలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment