Pages

Tuesday, January 31, 2012

బాలా మూవీ తమన్నా,నవదీప్ కాంబినేషన్ లో ?


సేతు, శివపుత్రుడు, వాడు వీడు లాంటి సినిమాలతో సదరన్ సినిమాని వనికించిన బాలా మరో మూవీతో భయపెట్టబోతున్నాడు. ఇరియమ్ థనాల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ షూటింగ్  ఇప్పటికే సగం వరకు పూర్తయ్యిందట. అయితే  బాలా ఇదే సినిమాని తెలుగులో కూడా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడట. దీంతో ఇరియమ్ థనాల్ ఫిల్మ్ షూటింగ్ ని సగంలోనే ఆపినట్టు సమాచారం. అయితే తమిళ్ వెర్షన్ లో అధర్వ, వేదికలు జంటగా నటిస్తుంటే, తెలుగు వెర్షన్ లో నవదీప్, తమన్నాలు కలసి నటిస్తారని టాక్. నవదీప్ పేల్యూర్ లో ఉన్నా మంచి పెర్ఫార్మర్ గా పేరుండటంతో ఈ హీరోని బాలా సెలక్ట్ చేశాడేమో అని అనుకుంటున్నారు సినీజనం.  

No comments:

Post a Comment