Pages

Thursday, January 26, 2012

అమితాబ్, రజనీలతో పూరి చిత్రం?


హమ్, గిరఫ్తార్, అంధా ఖానూన్ చిత్రాల్లో అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్ కలిసి నటించిన విషయం తెలిసిందే. దాదాపు 25ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఓ చిత్రంలో నటించబోతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ అపూర్వ నటుల కాంబినేషన్‌లో సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇటీవల పూరి జగన్నాథ్ చెన్నయ్ వెళ్లి రజనీకాంత్‌ని కలిసి, ఓ కథ చెప్పారట. ఆ కథ రజనీకాంత్‌కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి.

ఆ కథ నచ్చడం, తన అభిమాన నటుడైన అమితాబ్‌బచ్చన్‌తో కలిసి మళ్లీ నటించే అవకాశం కావడంతో రజనీ ఈ చిత్రాన్ని ఎంతో ఆనందంగా అంగీకరించా రట. ఎప్పట్నుంచో రజనీకాంత్‌తో సినిమా చేయాలనే ఆకాంక్ష పూరీకి ఉందట. కానీ, రజనీ స్థాయికి తగ్గ పాత్ర క్రియేట్ చేయకపోవడంతో ఇన్నాళ్లూ ఆయన్ని కలవలేదట పూరి. అందులోనూ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌ని కూడా నటింపజేయాలనుకున్నారు కాబట్టి... కథ, పాత్రలు కుదిరిన తర్వాతే కలవాలనుకున్నారట.

ఇప్పుడు అవన్నీ కుదరడంతో రజనీని కలిశారని తెలుస్తోంది. మరి.. అమితాబ్‌ని కూడా ఆయన సంప్రతించారా? అనేది తెలియాల్సి ఉంది. అమితాబ్‌తో పూరి జగన్నాథ్ ‘బుడ్డా’ చిత్రం చేసిన విషయం తెలిసిందే. బిగ్ బితో సినిమా చేయాలనే తన కలను ‘బుడ్డా’ నెరవేర్చిందని ఆ చిత్రనిర్మాణ సమయంలో జగన్ చెప్పారు.

ఇప్పుడు రజనీతో సినిమా చేయాలన్న కలను కూడా జగన్ నెరవేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. ఇటు దక్షిణాది సూపర్‌స్టార్, అటు ఆలిండియా సూపర్‌స్టార్‌తో కలిసి సినిమా అంటే భారీ ఎత్తున అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు చేరుకోవడానికి ఈ చిత్రాన్ని ఒక సవాల్‌గా తీసుకుని పూరి పథక రచన చేస్తున్నట్లు సమాచారం

No comments:

Post a Comment