Pages

Tuesday, January 31, 2012

మహేష్ బాబుకు వదిన దొరికింది



'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్‌ బాబుకు వదినగా నటించడానికి చాలా మందిని కసరత్తు చేశారు. ఎవరూ చేయడానికి అంగీకరించలేదు. ఎందుకంటే... ఆల్‌రెడీ మహేష్ బాబుతో వారంతా హీరోయిన్‌గా చేసేసినవాళ్లే.

అలాంటిది.. ఆయనకు వదినగా నటించాలంటే కాస్త బెరుకుదనం అంటూ సెలవిచ్చారట. దిల్‌రాజు నిర్మాతగా రూపొందిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్‌కు అన్నయ్యగా వెంకటేష్ నటిస్తున్నాడు. మహేష్‌కు ఆల్‌రెడీ హీరోయిన్‌ ఫిక్స్‌ అయింది. వెంకీకే కాలేదు. షూటింగ్‌ అయితే ఆయనపై సోలోగా వైజాగ్‌లో ఇటీవలే సీన్స్‌ తీశారు.

ఈ విషయమై... మహేష్‌బాబును ఇటీవలే అడిగితే... నాకు వదినగా నటింపజేయడానికి చాలామందిని అనుకుంటున్నారు... దర్శక నిర్మాతలు పనది అంటూ తెలివిగా సమాధానం చెప్పారు. ఆఖరికి తమిళంలో విజయవంతమైన చిత్రాల్లో నటించిన తెలుగు అమ్మాయి అంజలిని ఎంపిక చేశారు. షాపింగ్ మాల్, 'జర్నీ‌' వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది అంజలి.

No comments:

Post a Comment