Pages

Wednesday, October 12, 2011

మహేష్ బిజినెస్ మ్యాన్ లో మళ్ళీ ఐటెం సాంగ్


దూకుడు సినిమా ఇచ్చిన సూపర్ సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిజినెస్ మ్యాన్ చిత్రం షూటింగ్ లో మంచి జోష్ తో పాల్గొంటున్నాడు. విషయమేమిటంటే తన కెరీర్లో బ్లాక్ బస్టర్స్ ఆయన పోకిరి, దూకుడు సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉండటంతో సెంటిమెంట్ గా ఫీలయిన మహేష్ తన తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ లో కూడా ఓ ఐటం సాంగ్ ని పెట్టమని పూరీ, తమన్ లని కోరాడని విశ్వసనీయ సమాచారం. 

మహేష్ అడగడమే తడువుగా ఈ చిత్రం సంగీత దర్శకడు తమన్ అదిరిపోయే మాస్ బీట్స్ తో ఓ ఐటెం సాంగ్ ని ట్యూన్ చేసాడట. ఈ సాంగ్ కి ధియేటర్స్ లో మంచి రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సాంగ్ లో ఎవరు నటిస్తారన్నది ఇంకా కన్ఫమ్ కాలేదు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

No comments:

Post a Comment