Pages

Wednesday, October 12, 2011

మీడియాపై గుర్రు గా రామ్ చరణ్


 తెలుగు మీడియా ముఖ్యంగా టీవీ ఛానెల్స్ అన్నీ... రామ్ చరణ్ యాక్సిడెంట్ పాలయ్యారు. ఆ తర్వాత ..హీరో రామ్ చరణ్ తేజ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆ తర్వాత ఆయన సేఫ్ గా ఉన్నారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదం నుంచి తప్పించుకోవటం వరకూ నిజమే అయినా దానికి అంత పబ్లిసిటీ ఇవ్వటంతో ఎక్కడెక్కడనుంచి చరణ్ కీ,చిరంజీవికి,ఆయన కుంటాభానికి ఫోన్స్ వస్తున్నాయట. దర్శకుడు సంపత్ నంది కి కూడా ఎడతెగని ఫోన్స్ కంటిన్యూగా వస్తున్నాయి. దాంతో ఆయన ఈ వార్తను బయిటకు ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నారు. మరో ప్రక్క అల్లు శిరీష్ ట్విట్టర్ ...మాత్రం ఈ యాక్సెడెంట్ గురించి ట్విట్టర్ లో రాసి మరింత ప్రాచుర్యం కల్పించారు. అలా ఈ న్యూస్ దావానలంలా వ్యాపించింది. ఇక చరణ్ మాత్రం ... "నాలుగేళ్ల తర్వాత 'రచ్చ' ఇంట్రడక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం నేనెంతో ఇష్టపడే గోవాకి వచ్చా.

ఇక్కడ బాగా వేడిగా ఉంది. ఔట్‌డోర్ ఎ.సి.ని కనిపెట్టాలి'' అని ట్విట్టర్‌లో తెలిపారు. ఇక గోవాలో జరుగుతున్న 'రచ్చ' షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఫైట్‌మాస్టర్ అలన్ అమీన్ సారథ్యంలో రామ్ చరణ్ తేజ్ ఇంట్రడక్షన్ ఫైట్‌ని చిత్రీకరిస్తున్నారు.అయితే ఈ ఫైట్ సన్నివేశం తీసేప్పుడు అనుకోని ప్రమాదం సంభవించింది. ఓవైపు ట్రైన్ వస్తుండగా, మరోవైపు కారులోంచి రామ్ చరణ్ తేజ్ వేగంగా ట్రాక్ దాటే సీను తీస్తున్న సమయంలో కేబుల్స్ తెగిపోయాయి. దాంతో ట్రైన్ వేగంగా రామ్ చరణ్ తేజ్ ఉన్న కారువేపు వచ్చేసిందనీ, అయితే చరణ్ సహా అక్కడున్న వాళ్లంతా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 

No comments:

Post a Comment