Pages

Thursday, July 28, 2011

పొలి"ట్రిక్స్" తెలిస్తే మాట్లాడాలి.. లేదంటే మూసుకుని కూచోవాలి


FILE
రాజకీయాలు గురించి తెలిస్తేనే మాట్లాడాలనీ, లేదంటే నోరు మూసుకుని కూచోవాలని బాలీవుడ్ సెక్సీ సుందరి దీపికా పదుకునే సెలవిస్తోంది. ఈ వ్యాఖ్యలు కత్రినా కైఫ్ గురించే చేసిందన్నది వేరే చెప్పనక్కర్లేదు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని సగం భారతీయుడు అని చేసే కామెంట్‌పై పరోక్షంగా మాట్లాడుతూ.. కొంతమంది రాజకీయాల గురించి తెలియకపోయినా అనవసరంగా వేలు పెడతారని అంది. ఇటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు క్యాజువల్‌గా తీసుకోరని చెప్పుకొచ్చింది. 

తనమటుకు తాను రాజకీయాలు గురించి తెలియనప్పుడు గట్టిగా నోరు మూసుకుని కూచుంటానని చెప్పింది. ఇంతకీ పొలిటిక్స్ గురించి దీపికా ఇంతగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఆరా తీస్తే... భారతదేశంలో రిజర్వేన్ల విధానంపై రూపొందుతున్న ఆకర్షన్ అనే చిత్రంలో నటిస్తోందట దీపూ. మరి అందులో ఇటువంటి లెక్చర్లేమైనా ఉన్నాయేమో..?!!

No comments:

Post a Comment