Pages

Friday, July 29, 2011

అందులో అలా నటించలేదు బాబోయ్: రీమాసేన్



రీమాసేన్‌ ఈమధ్య మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. రామానాయుడు చిత్రం 'ముగ్గురు'లో ఒక కీలక పాత్ర పోషించింది. అయితే చిన్న పాత్రే అయినా మంచి పేరు వస్తుందని చెప్పింది. ఇలాంటి చిన్నపాత్రే మలయాళంలో నాలుగేళ్ళనాడు చేసిందట. 

బెంగాలీ నవల ఆధారంగా చేసిన ఆ సినిమా 'ఇతి శ్రీకాంత'. తాజాగా ఆ చిత్రాన్ని తమిళంలో డబ్‌ చేశారు. అందులో కొన్ని సీన్స్‌ ఎలాంటి అచ్ఛాదన లేకుండా వీపు భాగాన్ని చూపిస్తున్న దృశ్యాలు, హీరోతో శృంగార సన్నివేశాలున్నాయి. వాటిని ప్రస్తుతం బయటపెట్టి తమిళ నిర్మాత పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 

దీంతో తాను నటించిన చిత్రం శృంగార చిత్రమనే ప్రచారం సాగుతోందనీ, తనకిది చాలా మైనస్‌ అంటూ బాధపడుతోంది. మరి నిర్మాత మాత్రం ఏమీ పట్టనట్లున్నాడు. వెయిట్‌ అండ్‌ సీ...

No comments:

Post a Comment